దేవుడి పెళ్లి కి అందరూ పెద్దలే

తెలుగు నాటకరంగం ప్రారంభం నుండి దాని అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేసి ప్రశంసనీయమైన కృషి చేసిన, చేస్తున్న కళాకారులందరికి అభివందనాలు. భవిష్యత్ తరాలవారికి మరింత పటిష్టమైన రంగస్థలాన్ని రూపొందించుకొని, ప్రేక్షకాదరణ పొందేలా చేయాలంటే నటులు, రచయితలు, దర్శకులు, సమాజాలు, శిక్షణాలయాలు. ప్రదర్శనశాలలు, ప్రేక్షక సంఘాలు, పరిషత్తులు, న్యాయనిర్ణేతలు, సమీక్షకులు, ప్రచురణకర్తలు, ప్రభుత్వం- అందరూ మిత్రభావంతో తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకోవాలంటే ఒక ఉమ్మడి సమన్వయ వేదిక మరియు చర్చా వేదిక అవసరం అన్న ఆలోచన - ఈ వెబ్ సైట్ “రంగ మిత్ర”కు ప్రేరణ. సంయుక్తంగా, నిష్పాక్షికంగా, నిజాయితీతో కూడిన కార్యప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈ వెబ్ సైట్ “రంగ మిత్ర” ఉపయోగపడుతుందని ఆశ - ఆకాంక్ష - ఆశయం. వర్తమాన తెలుగు నాటకరంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేసి, జాతీయ అంతర్జాతీయ స్టాయిలో మన తెలుగు వారి ప్రతిభను చాటాలి. ఇది సుదూరప్రయాణానికి వేసే తొలి అడుగు మాత్రమే. రామసేతు నిర్మాణంలో ఉడుత తోడ్పాటు మాత్రమే... చేయి చేయి కలుపుదాం మన లక్షాన్ని సాధిద్దాం.