రంగమిత్ర
తెలుగు నాటకరంగ వికాసం - అభివృద్ధి - దశ - దిశ అంటూ ఎక్కడో ఒకచోట నిరంతరమూ నాటకరంగ ప్రముఖులు, నటులు, రచయితలు, ప్రయోక్తలు, దర్శకులు, పరిషత్తు నిర్వాహకులు,సమీక్షకులు ఇంకా ఎందరో సెమినార్లలోనూ, గోష్ఠులలోనూ, చర్చావేదికల మీద, ముఖాముఖి సందర్భాలలో, ఉపన్యాసాలలో తమ తమ అభిప్రాయాలని వెల్లడిస్తూనే ఉన్నారు. సలహాలు, సూచనలనూ అందిస్తూనే ఉన్నారు. కానీ వారు ఆశించేది కార్యరూపంలోకి రావడం లేదు. అందువల్ల గత 50 సంవత్సరాలుగా నాటకరంగంలో ప్రేక్షకుడిగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్వాహకుడిగా, అనువాద రచయితగా, సమీక్షకుడిగా, న్యాయనిర్ణేతగా నేను గమనించిన విషయాలను మిగిలినవారితో చర్చించి ఒక కార్యప్రణాళిక తయారు చెయ్యడంలో ఒక ఉమ్మడి సమన్వయ వేదిక అవసరం అని భావించి ఒక వెబ్ సైట్ ని ఏర్పాటు చేయాలన్నది సంకల్పం. ఇది సుదూర ప్రయాణానికి వేసే తొలి అడుగు మరియు రామసేతు నిర్మాణంలో ఉడుత తోడ్పాటు మాత్రమే .

ఈ వెబ్ సైట్ లో పొందుపరచదలచుకున్న అంశాలు ఈ వెబ్ సైట్ కు “రంగమిత్ర” అన్న పేరును ఎంపిక చేయడంలో ఉద్దేశ్యం – మన తెలుగు నాటకరంగంలో క్రమేపీ కనుమరుగౌతున్న “మైత్రీబంధా” నికి ప్రాధాన్యత ఇవ్వడం . మిత్రుడు – తన స్నేహితుని అభివృద్ధిని కాంక్షించి తగిన మార్గ నిర్దేశకత్వం చేస్తూంటాడు . స్నేహితుడు కూడా మిత్రుని సూచనలు, సలహాలు పాటించి ఆచరించాలి . పరస్పర అవగాహన, సహకారం అందించుకోవడం మిత్రధర్మం . నిస్వార్ధంగా సమస్త జీవకోటికి వెలుగును అందించి జీవనాన్ని ప్రసాదించేది మిత్రుడు (సూర్యుడు) కనుక కళాకారులు అందరూ మిత్రభావంతో తమ ధర్మాన్ని నిర్వర్తిస్తే రంగస్థల అభివృద్ధికి ఈ వెబ్ సైట్ తోడ్పడుతుందని ఆశ . నాటకం సమస్త కళల సమాహారం, సామూహిక ప్రక్రియ కనుక ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి మిత్రభావంతో ముందుగా ఆత్మపరిశీలన చేసుకొని ఆదర్శవంతమైన, ఆచరణీయమైన సూచనలు అందజేయగలరని ఆకాంక్షిస్తున్నాను .

తెలుగు నాటకరంగ అభివృద్ధికి తమ జీవితాలను ధారపోసిన ఎందరో మహానుభావులు – అందరికీ కళాభివందనాలతో – వారికి ఈ చిరుకానుక.

1. కళాకారులు మరియు సంస్థల వివరాల సేకరణ
జిల్లాలవారీగా నటులు, రచయితలు, దర్శకులు, సమాజాలు, శిక్షణాలయాలు,ప్రదర్శనశాలలు, ప్రేక్షకసంఘాలు, పరిషత్తులు, న్యాయనిర్ణేతలు, సమీక్షకులు, ప్రచురణకర్తలు వీరందరి గురించిన వివరాలతో పాటు వారి వద్ద లభించే నాటకరంగానికి సంబంధించిన రచనలు, పత్రికలు, ఆడియో, వీడియోలు మరి ఇతర సామగ్రిని సేకరించి డిజిటల్ లైబ్రరి ఏర్పాటు చేయడం – డాటా బేస్ ఏర్పరచడం .

2. విభిన్న సంస్థల మధ్య సమన్వయం
అ) పరిషత్తుల నిర్వహణ తేదీలు, దరఖాస్తు పత్రాలు, కార్యక్రమ ఆహ్వానాలు, కార్యక్రమ విశేషాలు, న్యాయనిర్ణయం, సమీక్షలు అన్నింటిని కూర్చి పోటీల కాలెండర్ తయారు చేయడం .
ఆ) ఇ - జర్నల్ నిర్వహించడం .
ఇ) నాటకసమాజాలవారి వివరాలు – వారి ట్రాక్ రికార్డుతో కలిపి పొందుపరచడం ద్వారా పరిషత్తులలో; నాటకోత్సవాలలో, ప్రేక్షక సంఘాలలో ప్రత్యేక ప్రదర్శనలకు సంప్రదించే అవకాశం కలుగుతుంది.
ఈ) మొబైల్ థియేటర్ కొరకు ప్రయత్నం చేయవచ్చు.

3. రచనలు-రచయితలు-ప్రచురణలు.
ప్రతి పరిషత్తు కొత్త రచనలు కావాలని కోరడం సహజం. కానీ ప్రతి సంవత్సరం 60కు పైగా కొత్త రచనలు వచ్చినా వాటిల్లో 15కు మించి ప్రదర్శనలకు నోచుకోవడం లేదు . మిగిలిన రచనలు వెలుగులోకే రావడం లేదు . ఆ రచనలు కూడా కొద్దిమంది నటుల చేతిలోనే పరిమితమౌతున్నాయి . ఏదో ఒక సమాజమే ప్రదర్శనలు ఇవ్వగలుగుతోంది. ఇతరులకు అవకాశం లభించడం లేదు. ఒకటో రెండో పరిషత్తులవారు ప్రచురించే సంపుటాలు మినహా రచయితలో, సమాజాలవారో తమకు తాముగా ప్రచురించుకొనేవి తప్ప 70% రచనలు అచ్చులో కనిపించడం లేదు .
భవిష్యత్తు తరాలవారికి ఈ సాహిత్యసంపద అందాలంటే ముద్రిత, అముద్రిత రచనల్ని ప్రభుత్వ తోడ్పాటుతో కానీ , ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇ - బుక్స్ గా డిజిటలైజేషన్ చేయడం (డాక్యుమెంటేషన్-ఆర్కివ్స్ ) నాటక రచనల పోటీలు నిర్వహించడానికి స్వచ్ఛంద సంస్థలు, పత్రికలు పూనుకోవాలి. ఉదా: అజో విభొ కందాళం ఫౌండేషన్, కువైట్ తెలుగు కళాసమితి . నంది మరియు ఇతర పరిషత్ పోటీలకు రచనలు ఆ సంవత్సరంలో వ్రాసినవే కావాలనకుండా కనీసం 3 నుండి 5 సంవత్సరాల పరిధికి పెంచవచ్చు. మంచి రచనలు వెలుగు చూస్తాయి . లేకపోతే “నాటక రచనా జీవితకాలం ఒక సంవత్సరమేనా” అనుకోవాల్సి వస్తుంది.

4. సాంకేతిక ప్రగతి
దేశంలో ఇతర ప్రాంతాలలోని రంగస్థలంలో కనిపించే సాంకేతిక సౌకర్యాన్ని, ప్రగతిని మనం అందిపుచ్చుకోవడం లేదు. మన ప్రదర్సనశాలలను సాంకేతికంగా అభివృద్ధిపరచాలంటే ఎంతో వ్యయప్రయాసలకు లోనుకావాల్సి ఉంటుంది. ప్రామాణికమైన కొలతలతో తాత్కాలిక రంగ స్థల నిర్మాణం చేసినా ప్రామాణిక లైటింగ్ విధానాన్ని ఏర్పాటు చేసుకునేలా రూపకల్పన (డిజైన్) చేయడం. సాధారణ లైటింగ్ తో పాటు టెక్నికల్ లైటింగ్ కోసం సంచార విభాగాలను ఏర్పాటు చేయడం. జిల్లాకు 2 యూనిట్స్- స్వయం ఉపాధి పథకం క్రింద కొంత సబ్సిడి మరికొంత బ్యాంక్ రుణాల ద్వారా శిక్షణ శిబిరాలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేయడం ( బడ్జెట్ 5 లక్షలు). పరిషత్తులకు, సమాజాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు నాటకరంగం సాంకేతికంగా ఉన్నతస్థాయికి ఎదగగలుగుతుంది. ( లైటింగ్ + సెట్ + మేకప్ )

5. నాటకరంగం – స్త్రీలు
మన నాటకరంగంలో పౌరాణిక నాటకరంగంలో తప్పించి సాంఘిక నాటక రంగం వైపు స్త్రీలు మొగ్గు చూపడం లేదు. రచయిత్రులు నాటక రచన చేపట్టడం లేదు. వారికి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి నాటక రచనలు ప్రత్యేకించి స్త్రీలు సమస్యలు, కుటుంబ సమస్యలు, బాలల సమస్యలకు సంబంధించి రచనలు చేయించవచ్చు. పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వవచ్చు. పత్రికల సహకారంతో వాటిని ప్రచురింపవచ్చు. నటీమణుల కొరత చాలా ఎక్కువగా ఉంది. టి‌వి / సినిమా మాధ్యమాలకు ఉన్నంత ఆకర్షణ ఈ రంగానికి లేదు. ఆర్థిక సుస్థిరత, ప్రజాదరణ ముఖ్యకారణాలు. నెలవారి స్టయిఫండ్ తో ( రూ.8 వేల నుండి 10 వేల వరకు ) కనీసం సంవత్సరానికి 5 నుండి 10 మంది వరకు తగిన శిక్షణ అందించడం. రెండవ సంవత్సరం ఆర్థిక సహాయం రూ.5 వేలకు పరిమితం చేయవచ్చు. ఈ విధంగా ప్రయత్నిస్తే 3 నుండి 5 సంవత్సరాలలో ఈ సమస్య తీరవచ్చు. ఈ బాధ్యతని ప్రభుత్వం, స్వచ్ఛంద, వాణిజ్య సంస్థలు స్వీకరిస్తే వారి సహాయ సహకారాలతో ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయవచ్చు. విద్యాలయాల్లో శిక్షణ నిమిత్తం వీరిని వినియోగించవచ్చు.

6. నాటక రంగం – యువత
యువత నాటకరంగం వైపు కన్నేత్తి చూడడం లేదు. దానికి ప్రధాన కారణం మన విద్యావిధానం. ఈనాడు ఉన్నత విద్యను అభ్యసించినవారిలో సైతం నైపుణ్యాల కొరత ఉందని – నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యక్తిత్వ వికాసం, భాషా నైపుణ్యాలు, ఉపాధి కల్పనా నైపుణ్యాలు, ఇంటర్వూలో విజయాన్ని సాధించడానికి శిక్షణ - ఉద్యోగాలలో సమర్ధవంతంగా పని చేసి గుర్తింపు తెచ్చుకోవడానికి కావల్సిన నైపుణ్యాలతో పాటు నైతిక విలువలు పెంపొందించడానికి / మానసిక ధృఢత్వం కోసం/సానుకూల దృక్పథం ఏర్పరచుకోవడానికి / సమాజ శాస్త్ర అధ్యయనానికి/ కర్తవ్య నిర్వహణకు జాతీయ దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి/ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి/ సామూహికంగా పనిచేసే దృక్పథం రూపొందించుకోవడానికి/కార్యనిర్వహణా పద్ధతులు /కళలు, సంస్కృతి పట్ల అవగాహన - ఇవన్నీ నాటక రంగంతో అనుబంధం పెంచుకుంటే సాధ్యమవుతుందని తెలిస్తే/ తెలియపరిచితే - యువత ఈ రంగం వైపు ఆకర్షితులవుతారు.

1. పాఠ్యప్రణాళికలో అంశంగా చేర్చడం.
2. శిక్షణలో భాగంగా చేయడం.
3. సామాజిక సేవా రంగంలో వీటి ప్రాధాన్యతను గుర్తించడం.
4. 15 నుండి 20 నిమషాల వ్యవధితో సామాజిక సమస్యలపై లఘు నాటికలు తయారుచేయడం.
5. యువజనోత్చవాలు నిర్వహించడం.
6. ఉద్యోగాలలో రిజర్వేషన్లు, క్రీడలతో పాటుగా కల్పించడం.
7. సాయంత్ర వేళల్లో పార్ట్ టైమ్ డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సులు స్థానిక కళాకారులు మరియు అధ్యాపకుల సహాయంతో ప్రారంభించడం.

7. పాఠశాలల్లో నాటకరంగం
కాలానుగుణంగా పాఠశాల వార్షికోత్సవాల్లో లేదా సాంస్కృతిక వారోత్సవాల్లో నాటక ప్రదర్శనలు దాదాపు కనుమరుగయ్యాయి. ఫ్యాన్సీ డ్రస్ పోటీలు, మోడ్రన్ డాన్సులు , సినిమా పాటలు తప్పించి మరొకటి కనిపించడం లేదు. బాలల నాటకాల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం నంది నాటకోత్సవాలలో బాలల విభాగాల్ని చేర్చడం జరిగింది, కానీ అనుకున్న రీతిలో బాలల నాటకరంగం ఆశించిన అభివృద్ధిని పొందలేకపోయింది.
విద్యార్థులలో పరీక్షలంటే భయం, మానసిక ఒత్తిడి, విపరీత ధోరణులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, లేదా సామాజిక ద్రోహులుగా, నేరగాళ్లుగా మారుతున్నారు. వీటి నుండి వారిని దూరం చేయడానికి నాటకరంగం ఒక సాధనం అవుతుంది. బాలల రచనలు చేయడం ద్వారా వారిలో తమ తమ సమస్యల పట్ల అవగాహన కలగటమే కాక సృజనాత్మకత పెరుగుతుంది. సామూహిక జీవితం వారికి సాంత్వన కలిగిస్తుంది. కనుక అధ్యాపకులు, ఇతర రచయితలు విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించాలి.
స్థానిక నటులు, నాటక సమాజాలవారు తమ విరామ సమయాన్ని ఆయా విద్యార్థులకోసం వెచ్చిస్తే, ఆ పాఠశాలవారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. వారి ప్రదర్శనశాలలు లేదా తరగతి గదులు రిహార్సల్స్ కు, ప్రదర్శనలకు ఉపయోగించుకొనే వీలు కలుగుతుంది. విద్యార్ధులకు శిక్షణతో పాటు మంచి ప్రదర్శనలు చూసే అవకాశం కలుగుతుంది.
Sunday Clubs ప్రారంభించవచ్చు.
మండలాలవారీగా ఉత్సవాలు/బాలోత్సవ్ లాంటివి నిర్వహించి జిల్లాస్థాయికి పెంచవచ్చు నంది నాటకోత్సవాలలో ప్రదర్శించిన బాలల నాటికల వీడియోలను పాఠశాలల్లో ప్రదర్శింపజేయాలి.

8. నాటకసమీక్షలు – విమర్శలు - మీడియా ( Print & Electronic ) తోడ్పాటు:
నాటకరంగ వికాసానికి తోడ్పడే ఎందరో మహానుభావుల్లో వీరు ఆంటే సమీక్షకులు/విమర్శకులు ఎంతైనా అవసరం. కాని వర్తమాన పరిస్థితుల్లో ఆ వర్గం బయటకు రావటం లేదు. ఆ వర్గం నిష్పాక్షికత, అనుభవం, నిజాయితీతో కూడిన విశ్లేషణాత్మకమైన సమీక్ష/విమర్శ ద్వారా ఎన్నో నాటకరంగ సమస్యలకు పరిష్కారం చూపించవచ్చు. కానీ వారు మౌనంగానే ఉంటున్నారు. కారణం?
1. వారి వారి అభిప్రాయాల్ని వెలిబుచడానికి తగిన వేదికలు, పత్రికలు, ప్రసార సాధనాలు లేకపోవడమే .
2. న్యాయనిర్ణేతల అభిప్రాయాలనే గౌరవించలేని నటులు, దర్శకులు, రచయితలు, సమాజ నిర్వాహకులు ఉన్నప్పుడు తమ అభిప్రాయాలకు
విలువ ఏముంటుందనే అభిప్రాయం కాబోలు – వారు మౌనంగానే ఉంటున్నారు. న్యాయనిర్ణేతల అర్హతల్నే ప్రశ్నించేవారు వీళ్ళని మాత్రం ఎందుకు
ఉపేక్షిస్తారు. ప్రేక్షకవర్గంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఈ వర్గాన్ని ఉపేక్షిస్తే ప్రేక్షకులు ఆశించే స్థాయికి తాము ఎప్పటికి ఎదగగలమో అందరు కళాకారులు
తమను తాము ప్రశ్నించుకోవాలి. దీనికి సంబంధించి అనుభవజ్ఞులైన విమర్శకులతో సెమినార్లు,అవసరమైతే శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలి.
చర్చాగోష్ఠులు సానుకూల వాతావరణంలో జరగాలి.
Theatre Appreciation Course లాంటివి ఉపయోగపడతాయేమో ఆలోచించాలి.
e-journals అందుకు ఒక సమాధానం కావచ్చు.
Social network ను కూడా ఒక వేదికగా మార్చుకోవచ్చు.

9. జాతీయస్థాయిలో తెలుగు నాటక రంగం :
అసలు జాతీయ స్థాయి ఆంటే అవగాహన కలగటానికి ఆ స్థాయిలో నిర్వహిస్తున్న నాటకోత్సవాలను ప్రేక్షకుడిగా చూసి ఆ తరువాత వాటితో మనల్ని పోల్చుకొని మనమెక్కడున్నామో నిర్ధారించుకోవాలి. సాంకేతికపరంగాను, ప్రదర్శనరీతుల పరంగానూ, రచన, దర్శకత్వ ప్రతిభల ఆధారంగానూ, నటీనటుల సామర్ధ్యం, నిబద్ధత, పరిపూర్ణతను దృష్టిలో పెట్టుకొని తులనాత్మక పరిశీలన చేసుకోవాలి. దీనికోసం మనం ఆ నాటకోత్సవాలలో భాగం కావడం, లేదా అలాంటి ఉత్సవాలను మన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం.
రచనలపరంగా ఆ స్థాయి నాటకాలు ఏ భాషనుంచైనా సరే తెలుగులోకి అనువదించి ప్రదర్శించడం - ఒక మార్గమైతే - మనం ఉన్నతస్థాయి అనుకునే మన ప్రదర్శనలను/ రచనలను ఎంపిక చేసి ఇతర భాషలలోకి అనువాదం చేసి ప్రదర్శింపచేయడం మరోమార్గం.దీనికి ఒక కార్యప్రణాళిక ఏర్పాటు చేయాలి. అనువాదం చేయబడ్డ నాటకాలను పరిషత్తు / నంది నాటక పోటీలలో కాలంతో నిమిత్తం లేకుండా ( ఆ సంవత్సరలో అనువదించబడ్డవి. అయితే చాలు ) అనుమతించాలి.
ప్రదర్శనపరంగా :
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రదర్శనారీతులను పరిశీలించాలి.
సాంకేతిక శిక్షణ / సౌకర్యాలు ఏర్పరచుకోవాలి.
జాతీయస్థాయిలో ఎన్ ఎస్ డి వంటి శిక్షణా సంస్థలను మన దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. లేదా వారి తోడ్పాటుతో విరివిగా శిక్షణా శిబిరాలు నిర్వహించాలి.
Professionalism పెరగాలి. Reportary ని తిరిగి ప్రారంభించాలి.
Archives, Documentation చేపట్టాలి.

సంక్షిప్తంగా :
1. స్థానికంగా నాటక రంగానికి సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థలు సంఘటితంగా, సహకార పద్ధతిలో వ్యవహరించాలి.
2. పరిషత్తులు Competitions Calendar రూపొందించాలి.
3. సమాజాల వారు తమ సంస్థ ట్రాక్ రికార్డు తయారుచేసి అందుబాటులో ఉంచాలి.
4. నాటక రంగానికి సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందజేయడానికి అందరూ సిద్ధపడాలి.
5. ప్రదర్శనశాలలను సాంకేతికంగా, సౌకర్యవంతంగా ప్రదర్శనలకు అనుగుణంగా అభివృద్ధిపరచాలి.
6. నాటక రంగానికి దూరంగా ఉంటున్న స్త్రీలను, యువతను, బాలలను ఆకర్షించాలి. శిక్షణ అందించాలి. భాగస్వాముల్ని చేయాలి.
7. స్వయం ఉపాధి పథకం క్రింద కొంత సబ్సిడి మరికొంత బ్యాంక్ రుణాల ద్వారా సంచార సాంకేతిక విభాగాలను ఏర్పరచాలి.
8. నటీమణుల కొరతను – ఆర్ధిక సహాయం కల్పించి శిక్షణ భృతితో శిక్షణ అందించడం ద్వారా దూరం చేయాలి.
9. నృత్య, సంగీత కళాశాలల్లో పద్య నాటకాల శిక్షణ ఇవ్వాలి.
10. నట శిక్షణాలయాలతో పాటు జాతీయ స్థాయి ఎన్ ఎస్ డి సహకారంతో శిక్షణా శిబిరాలు నిర్వహించడం.
11. యువజనోత్సవాలు – బాలోత్సవాలు కింది స్థాయి నుండి ప్రారంభించాలి.
12. రచనల్ని, ప్రదర్శనల్ని( Audio,Visual ) డిజిటలైజేషన్ చేయాలి. (డాక్యుమెంటేషన్-ఆర్కివ్స్).
13. ఇ - జర్నల్ ప్రారంభించాలి.
14. Social – Networkని ఉపయోగించాలి.
15. వెబ్ సైట్ తయారుచేయాలి .
16. ప్రభుత్వం నంది నాటక విజేతల్ని / ఔత్సాహికుల్ని కొందరినైనా భారతీయ రంగ మహోత్సవ్ కు పంపాలి.
17. నంది నాటకోత్సవాలు ( పోటీలు) నాటక రంగ అభివృద్ధికి తోడ్పద్దాయో లేదో సమీక్ష చేసుకోవాలి. తద్వారా మరింత మెరుగైన ప్రయత్నం చేయవచ్చు.
18. జానపద, గిరిజన సంస్కృతి, కళారూపాలను గుర్తించి, వాటిని సంరక్షించుకోవాలి.
19. మెరుగైన ప్రభుత్వ సాంస్కృతిక విధానాన్ని రూపొందించాలి. గతంలో తీసుకొన్న నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలి. కళాకారుల సంక్షేమం,
రంగస్థల ప్రాథమిక సౌకర్యాలు వంటి విషయాలపై కళాకారుల విన్నపాలు స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలి.
20. నాటక రంగానికి సంబంధించిన అన్ని విభాగాల కళాకారులు ప్రాంతీయ సంఘాలుగా ఏర్పడి తరువాత రాష్ట్ర సమాఖ్యగా ఏర్పడితే సమిష్టిగా ఎంతో కొంత అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుంది.

పై వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఔత్సాహికులు, నాటకరంగ ప్రముఖులు మరియు పెద్దలతో చర్చించి, సాధ్యాసాధ్యాలు పరిశీలించి, నూతన సాంస్కృతిక విధానాన్ని తయారు చేయాలి. పైన పేర్కొన్న వాటిల్లో అవకాశం ఉన్నంత మేరకు Pilot Projects చేపట్టాలి.

BIO-DATA
Dr K Mohan Rao, M A Ph D.,
Date of Birth : 10-02-1945
Addresss :
2-170 Vidya Nagar colony,
Satrampadu, ELURU-534 007
West Godavari District (A P).
Mobile No : 98482 10331, 94902 10331
Res : +91 8812 231645
e-mail kmrao.careerinfo@gmail.com, kmr@rangamitra.co.in

Academic qualifications:
1. M A (Hindi) Andhra University First Rank
2. Sahitya Ratna(Hindi) Sahitya Sammelan, Allahabad
3. Diploma in Theatre Arts (Acting) Andhra University
4. Diploma in Theatre Arts (Direction) Andhra University
5. Ten weeks Intensive Theatre Workshop organized by Dept of Theatre Arts, Andhra University Visakhapatnam and National School of Drama, New Delhi
6. Ph D in Hindi Andhra University Topic: Age conscious Novelists Kavisamrat Viswanatha
Satyanarayana and Acharya Chatursen Sastry – A Comparative study
7. Pre-Ph D in Theatre Arts. Andhra University Topic: Telugu Theatre Development – Experiments and Audience

Academic Awards
Best College Teachers’ Award 1994 awarded by Government of Andhra Pradesh
Cultural/Theatrical Award
Kandukuri Theatre Award – Andhra Pradesh State Film, Television and Theatre
Development Corporation Ltd and Council for District Cultural Affairs, West Godavari District for 2011 and 2012

Experience as Judge
1. Final Judge for Children plays Competition in Nandi Natakotsavam 2009 at Khammam conducted by APSFTT Corporation Ltd Hyderabad A P
2. Paruchuri Raghu Babu memorial National Drama Competitions at Pallekona, Repalle Mandal Guntur District (3 times)
3. Akkineni Nageswara Rao Natakakala Parishad Drma Competitions, Hyderabad
4. G S R Murthy Memorial Drama Competitions at Vijayawada
5. Sumadhura Nataka kala parishad Drama Competitions, Vijayawada
6. Pantam Padmanabham Memorial Drama Competitions at Kakinada
7. Sripada Nataka Kala Parishad Drama Competitions at Nizamabad
8. ‘Rangasthali’ Narasaraopeta Drama Competitions at Narasaraopet
9. Abhinaya Arts Drama Competitions at Ponukumadu, Guntur District
10. Palnadu Drama Competitions at Piduguralla Guntur District
11. Town Artists Association, Tenali Drama competitions at Tenali
12. Tenugu Darbar,Eluru Drama Competitions at Eluru
13. Garikapati Natakakala parishad Drama Competitions at Eluru
14.YMHA Nataka Kalaparishad, Eluru
15. Pragathi Kala Mandali, Sattenapalli
16.Bhadradri Nataka Kalaparishad, Bhadrachalam
17.D L Kanta RaoPostal Employees Kala Parishad, Tenali
18. SahrudayaNataka kala Parishad, Hanumakonda
19. Maheswari Prasad Comedy Club Nataka kalaparishad, Vijayawada
20.. Gowreeswara Nataka kala Prishad, Chodavaam,Vishakhapatnam
21. Paripallemma Nataka Kala Parishad, Haripalem, Visakhaatnam
22.Venkannapalem Nataka Kala Parishad, Venkannapalem, Visakhapatnam
23.Grameena kalakarula Nataka Kala Parishad, Bhairipalem, Srikakulam
24.Andhra Pradesh State level Youth Festival, Guntur.
and also acted as judge for many dramatic/cultural competitions conducted by colleges, State and Central Govt Organisations viz Banks, Telephones, Income Tax, Revenue and Police Departments

Offices held
1. Executive member, Council for District Cultural Affairs, West Godavari District and selection committee member for the selection of theatre groups for the publicity of Govt Programmes
2. President, Dramatic Association, Sir CRR College, Eluru 1971-1977
3. Convener, Inter Collegiate Cultural Competitions conducted at Sir CRR College, Eluru 1971-1977
4. Convener, Andhra University Youth Festivals 1989 and 1999 conducted at Sir CRR College, Eluru and lead the University Teams to the Zonal Competitions at Tirucharapalli and Tirupathi
5. Founder Member, Elite Forum of Fine Arts, (EFFA) Eluru – Monthly Organisation
6. Founder Member, SPIC-MACAY New Delhi Eluru Chapter

Theatre Workshops
Organized Four Weeks Theatre Work shop for Women and Children at Eluru under the banner of EFFA Guest faculty, Work shop on Cinema and Drama Script writing at Vijayawada.

As an Actor
1. Acted in many prize winning dramas at college and state level
2. “B” Grade Casual Artist, All India Radio, Vijayawada
3. Participated in T V and Films

As Director
Directed more than 50 plays at college level and state level for various organizations


As Creative Writer
Wrote Short Stories, Poetry and literary essays published in various magazines One-act play – “Manchi Rojulu Vachaai” for S C & B C Welfare was staged, broadcasted in AIR Vijayawada and Telecasted in Dooradarshan, Hyderabad As Editor 1. “Rangasthali” EFFA Special Issue and monthly bulletins 2. LIONS monthly bulletins and Decinnial Special Issue 3. Special Issue of West Godavari District in connection with World Telugu Conference 2012 at Tirupathi As Translator Translated six dramas- Three from Telugu to Hindi and Three from Hindi to Telugu Translated Sixteen Radio National dramas and features – Eight from Telugu to Hindi and Eight from Hindi to Telugu Association with 1. Local Theatre groups at Eluru and West Godavari District 2. Ajo-Vibho-Kandalam Foundation, Hysderabad 3.Nandi Natakotsavam 2015 at Tirupati As Speaker 1. Spoke on “Telugu Drama – Its Movement in Colleges” at Dept of Theatre Arts, Andhra University Telugu Drama Centenary Celebrations 2. Modern Age Dramatist Bellamkonda Ramadas – A Thespian in Telugu Theatre – AIR Vijayawada 3. Problems in Translation with reference to Telugu and Hindi Dramas 4. The Role of Translations in the Development of Telugu Theatre Lecture Demonstrations The Importance of Theatrical Activity in the development of Communication Skills, Soft Skills, Personality Development and Campus Recruitment Training for Engineering and Professional college students Future plans : “Telugu Drama” – Trends and Techniques – Influence of Translations. Designing Rangamitra website for documentation and digitalization of Telugu theatre. Coordination to conduct theatre workshops for Women, Children and Youth Translations of Telugu dramas in to Hindi and Hindi to Teugu. Theatre in education Programs